భారత స్వాతంత్ర్య వేడులకు భారీగా ఏర్పాట్లు: సీఎస్
ABN, First Publish Date - 2021-03-10T22:10:27+05:30
భారతస్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: భారతస్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, జంక్షన్లను విద్యుత్ బల్బులతో కాంతులీనేలా అలంకరించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవ ఏర్పాట్ల పై సీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12 న ఉదయం 11.00 గంటలకు పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు, అలాగే వరంగల్ లో జరిగే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, జి.ఎ.డి.(పోలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్,జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, టీఎస్ ఎస్పీడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-10T22:10:27+05:30 IST