ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షంతో పంటలకు నష్టం

ABN, First Publish Date - 2021-04-14T05:34:04+05:30

అకాల వర్షంతో పంటలకు నష్టం

కాటారం మండలం దేవరాంపల్లిలో నేలవాలిన వరి పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాటారం, ఏప్రిల్‌ 13 : మండలవ్యాప్తంగా సోమవారం రాత్రి గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలి దుమారం, వర్షంతో పలు చోట్ల యాసంగి వరి పంట దెబ్బతింది. దేవరాంపల్లి, రేగులగూడెం, భూడిదపల్లిలో లక్ష్మయ్య, రవి, గట్టయ్య, బాబుజానీ, సాగర్‌, సమ్మయ్య, రాజిరెడ్డి, సంపత్‌, రఘు, బాపుతో పాటు పలువురు రైతులకు చెందిన వరి పంట నేల వాలింది. పలు చోట్ల మామిడి తోటల్లో గాలిదుమారంతో కూడిన వర్షానికి మామిడి కాయలు రాలిపోయా యని రైతులు తెలిపారు. ఇప్పటికే కోసిన వడ్లను కొందరు రైతులు కళ్లాల్లో ఆరబెట్టగా అకాల వర్షంతో తడిసిముద్దయ్యాయి. చాలా చోట్ల  మరి కొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికందే సమ యంలో వానలు కురిస్తే నష్టం వాటిల్లుతుందనిఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-04-14T05:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising