ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

ABN, First Publish Date - 2021-10-26T04:57:13+05:30

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం  రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి

గోవిందరావుపేట, అక్టోబరు 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని  సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో గుండు రామస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ ఏడో మహాసభలో కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వరంగాలను కేంద్రం కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా అప్పజెబుతోందని విమర్శించారు. నూతన చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని రైతుల నుంచి దూరం చేస్తోందని మండిపడ్డారు. పండించిన పంటలకు గిట్టుబా టు ధర కల్పించకుండా రైతుల నడ్డి విరుస్తోందని దుయ్య బప ట్టారు. కులం, మతంపేరుతో రెచ్చగొట్టి దేశంలో వైషమ్యాలు కలగ జేసి పబ్బం గడుపుతోందని అనానరు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, నాయకులు బీరెడ్డి సాంబశివ, పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి, గొంది రాజేష్‌, అంబాల పోశాలు, మురళి, గంగాధరి స్వరూప తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising