ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు!

ABN, First Publish Date - 2021-04-11T15:02:08+05:30

సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌కు మద్దతుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌కు మద్దతుపై అధికారికంగా వామపక్షాలు  ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఇప్పటికే సాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా మద్దతు ప్రకటించారు. బీసీలకు సాగర్‌ టికెట్ కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భగత్‌ను గెలిపించి కొత్త చరిత్రకు బీసీలు నాంది పలకాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. 


ఇప్పటికే సాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రచార హోరును పెంచింది. దీనికి తోడు ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు ఖాయమైంది. కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు. అప్పటికి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ నేతలు క్షేత్రంలో శ్రమిస్తున్నారు. ఓవైపు ప్రచారంలో భాగస్వాములవుతూనే, మరోవైపు కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-04-11T15:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising