ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2021-11-12T01:08:57+05:30

భారత్‌కు 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న నటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత్‌కు 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె అని ఆయన ఆరోపించారు. కంగనాకి పద్మశ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంపై మాట్లాడే అర్హత కంగనా రనౌత్‌ సహా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి కూడా లేదని నారాయణ పేర్కొన్నారు. 




‘‘1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’’ అంటూ మోదీ ప్రధాని అవ్వటాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఓ కామెంట్ చేసిన విషయం తెలిసిదే. అయితే, నరేంద్ర మోదీని కంగనా ఇలా పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్‌కి వరుణ్ గాంధీ రియాక్ట్ కావటం సొషల్ మీడియాలో చర్చగా మారింది. ‘‘మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు, ఇక ఇప్పడు... మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని సైతం చులకన చేయటం! దీన్ని ఏమనాలి... పిచ్చా? లేక దేశ ద్రోహమా?’’ అంటూ ట్విట్టర్‌లో కంగనాని విమర్శించారు వరుణ్ గాంధీ. 

Updated Date - 2021-11-12T01:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising