ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: సీపీ అంజనీకుమార్

ABN, First Publish Date - 2021-12-16T20:57:58+05:30

హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉండడానికి నేను సైతం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉండడానికి ‘నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని  సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం జాంబాగ్‌లోని అప్జల్‌గంజ్, సుల్తాన్ బజార్ పోలీసుస్టేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ‘నేను సైతం’లో భాగంగా 60 సీసీ కెమెరాలను నగర సీపీ అంజనీకుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్‌రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్‌లతో కలసి ప్రారంభించారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగంపడడంతో పాటు నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని అన్నారు. నూతన సంవత్సర వేడుకలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు జరుపుకోవాలని సూచించారు. వేడుకలో యువత మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను తల్లిదండ్రులు తమ పర్యవేక్షణలో చూసుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు

Updated Date - 2021-12-16T20:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising