ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా భయంతో స్పృహ కోల్పోయిన మహిళ

ABN, First Publish Date - 2021-04-11T13:53:42+05:30

కరోనా టీకా తీసుకుని భయంతో ఓ మహిళ స్పృహ కోల్పోయిన ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పీర్జాదిగూడ : కరోనా టీకా తీసుకుని భయంతో ఓ మహిళ స్పృహ కోల్పోయిన ఘటన పీర్జాదిగూడలో జరిగింది.  స్థానిక యూపీహెచ్‌సీలో 121 మంది కార్పొరేషన్‌ సిబ్బందికి కరోనా టీకా వేశారు. స్వీపర్‌గా పని చేస్తున్న లత (32) సాయంత్రం వ్యాక్సిన్‌ వేయించుకోగానే, స్పృహ కోల్పోయింది. వెంటనే డాక్టర్‌ ఆమెను పరీక్షించగా టీకా వికటించిన లక్షణాలేవీ కనిపించలేదు. భయంతోను స్ప్పహ కోల్పొయి ఉంటుందని నిర్ధారణకు వచ్చి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె కుదుట పడ్డారు. భయంతో నరాలు బిగుసుకుపోయి, మానసికంగా ఆందోళనకు గురై స్పృహ కోల్పోతుంటారని డాక్టర్‌ తెలిపారు. టీకాలు సురక్షితమేనని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దన్నారు.


కాగా.. ప్రభుత్వ ఆదేశా మేరకు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తప్పనిసరిగా వాక్సిన్‌ వేసే ప్రక్రియను మొదలు పెట్టారు. శనివారం ఉప్పల్‌ సర్కిల్‌లోని పారిశుధ్య,  ఎంటమాలజీ, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాల సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రత్యేక డ్రైవన్‌ నిర్వహించారు. సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ అరుణకుమారి, శానిటేషన్‌ విభాగం ఇన్‌చార్జి చందన ఆధ్వర్యంలో  300 మంది సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు.

Updated Date - 2021-04-11T13:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising