ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-11T05:53:26+05:30

ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

కొంరయ్య (ఫైల్‌)రంజిత్‌కుమార్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లబెల్లి, మే 10: కరోనా సోకిందని వృద్ధుడు ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన సోమవారం నల్లబెల్లి మండలం గొల్లపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యు లు కథనం ప్రకారం. నాగిరెడ్డి కొంరయ్య(59)కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కొంరయ్య ఈ నెల 4న మేడపల్లి పీహెచ్‌సీలో కొవిడ్‌ టెస్ట్‌ చేసుకోవ డంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వైద్యులు రెఫర్‌ చేశారు. అయితే కొంరయ్య ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటిలోనే చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం ఛాతినొప్పితో అవస్థపడుతూ మనస్థాపానికి గురై ఇంటిలో సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకు న్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సె వెంకటేశ్వర్లు వెల్లడించా రు. కాగా, మృతదేహం వద్దకు గ్రామస్థులెవరూ రాక పో వడంతో సర్పంచ్‌ భర్త రాజ్‌కుమార్‌, మాజీ ఉపసర్పంచ్‌ సురేందర్‌లు ట్రాక్టర్‌లో తరలించి ఖననం చేశారు. 

గొర్రెకుంటలో యువకుడు.. 

గీసుగొండ: గ్రేటర్‌ వరంగల్‌ 15వ డివిజన్‌ గీసుగొండ మండలం గొర్రెకుంటలో కరోనా సోకిందని మనస్థాపం తో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన చిట్యాల రంజిత్‌కుమార్‌(23)కు వారం రోజులు క్రితం కరోనా సో కింది. అతను ఎంజీఎంలో చికిత్స పొందాడు. అనంత రం డాక్టర్‌లు ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉండాలని సూ చించారు. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన అత ను అదే రోజు రాత్రి జాన్‌పాక సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య 7నెలల గర్భవతి కావడంతో స్థానికు లను కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి గతం లోనూ మృతిచెందగా, తల్లి కూలీ పనులు చేసుకుం టూ జీవిస్తోంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఎన్నికలతోనే కరోనా సోకింది....

ఇటీవల జరిగిన గ్రేటర్‌ ఎన్నికల వల్లే రంజిత్‌కు మార్‌ కరోనా బారిన పడ్డాడని దళిత శక్తి ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ రవి ఆరోపించారు. ఎన్నికల్లో కనీస కరోనా నిబంధన లు పాటించలేదన్నారు. దీంతో గ్రామంలో ఇప్పటికే 100 పైగా కరోనా లక్షణాలు ఉన్నవారు ఉన్నారన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థికాసయం అందించి ఆదుకోవాలని కోరారు. విలీన గ్రామాల్లో కరోనా రోజుకు ఒకటి రెండు మరణాలు సంభవిస్తున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-05-11T05:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising