ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతంగా కరోనా

ABN, First Publish Date - 2021-04-11T16:06:50+05:30

ఉత్తర తెలంగాణలో ఉధృతంగా కరోనా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో కరోనా అత్యధికంగా నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో ఉధృతంగా కరోనా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో శనివారం ఒక్క రోజే 532 కరోనా కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో నిన్న ఒక్క రోజే 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఒక్క రోజే 336 కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఉట్నూర్‌లో 42 కేసులు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలో 4 రోజుల్లో 549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లింగాపూర్ మండలంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో లింగాపూర్, వాంకిడిలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. 



ఉమ్మడి జిల్లాలో కరోనావ్యాప్తి తగ్గడం లేదు. ప్రతీరోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని టెస్టులు పెంచిన రీతిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదు కావడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత నెల నుంచి మహారాష్ట్రలో వైరస్‌ వేగంగా విస్తరించడమే కాకుండా కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. అప్పటి నుంచే జిల్లాలోనూ పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతూ వచ్చాయి.


Updated Date - 2021-04-11T16:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising