ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా గ్రామాలను తెలంగాణలో కలపండి

ABN, First Publish Date - 2021-02-06T06:08:59+05:30

స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌కు మహారాష్ట్ర గిరిజన రైతుల వినతి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేవని.. వాటిని తెలంగాణలో కలపాలని ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాల గిరిజన రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కేంద్రమైన నాందేడ్‌కు తాము 300కి.మీదూరంలో ఉన్నామని, అందువల్ల తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుతో మహారాష్ట్రలో కలిసిన  తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రపతిని కలిసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

Updated Date - 2021-02-06T06:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising