ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి షోకాజ్ నోటీస్

ABN, First Publish Date - 2021-07-12T16:41:53+05:30

హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్‌కి చెందిన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్‌కి చెందిన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ‘‘టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫర్మ్ అయ్యింది. యూత్‌ అందరినీ మన పార్టీలోకి గుంజాలి. యూత్‌కు ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటాను. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దాం’’ అంటూ కౌశిక్ ఫోన్ సంభాషణలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఈ షోకాజ్ నోటీస్‌ను జారీ చేశారు.


హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ.. కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణల లీక్ నేపథ్యంలో ఈ షోకాజ్ నోటీస్‌ను జారీ చేశారు. కౌశిక్ కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. టీఆర్ఎస్‌ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలోనే కౌశిక్‌రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. 24 గంటల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్‌లో క్రమశిక్షణ సంఘం పేర్కొంది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Updated Date - 2021-07-12T16:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising