ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉనికి కోసమే బండి సంజయ్... ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-11-29T20:54:13+05:30

రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదని, కేవలం ఉనికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అసలు లేనే లేదని, కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే తప్ప రైతుల కోసం కాదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇక వరి డ్రామాలు ఆపాలన్నారు. ఆకస్మిక విజిట్ చేసి రైతుల సమస్యలను  తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. వరి ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రెండు నెలలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతులంతా రాత్రిళ్లు వరి కుప్పలదగ్గరే పడుకుంటున్నారని పేర్కొన్నారు. 60 శాతం ధాన్యం ఇంకా రోడ్లమీదనే ఉందన్నారు. కొనుగోలు ఆలస్యం కావడం వల్ల కల్లాల్లోనే ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వుండే రైతులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు టీవీల్లో మాట్లాడడం కాదు, వారం రోజుల్లో  ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.




బండి సంజయ్ మాటలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు లాభం జరగదన్నారు. వరి సాగు మానేయాలని రైతులకు చెప్పడం సరికాదన్నారు. యాసంగి సంగతి తర్వాత.. ముందు వానాకాలంలో పండిన పంటను కొనాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్నారు సరే..పంటను ఎందుకు కొనరని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. పీఎం అయినా సీఎం అయినా ప్రజా సేవకులే తప్ప శాసించేవారు కాదని హితవు పలికారు. రైతులను ఏ పంట వేయాలో శాసించకండని సూచించారు. 

Updated Date - 2021-11-29T20:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising