ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టులు

ABN, First Publish Date - 2021-01-20T05:11:21+05:30

కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టులు

గృహ నిర్బంధంలో ఉన్న నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చలో రాజ్‌భవన్‌’కు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత 

వరంగల్‌ సిటీ, జనవరి 19 : కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చ ట్టాలు, పెరిగిన పెట్రోలు ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం చలో రాజ్‌భవన్‌కు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. నా యకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా నుంచి వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు వెళ్తు న్న కాంగ్రెస్‌ నాయకులను సోమవారం రాత్రి నుంచే పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు టీపీసీసీ నేతలు నమిండ్ల శ్రీనివాస్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, బంక సంపత్‌యాదవ్‌, 44వ డివిజన్‌ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ, కొత్తూరు రాజును నాయిని రాజేందర్‌రెడ్డి ఇంటిలో హన్మకొండ పోలీసులు నిర్బంధించారు. మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వరరావు, కట్ల శ్రీనివాస్‌ ఇతర నాయకులను ఎక్సైజ్‌కాలనీలోని వ రద రాజేశ్వరరావు ఇంటి వద్ద అడ్డుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధులు, మీసాల ప్రకాశ్‌, కానుగంటి శేఖ ర్‌, కాజీపేటలో జక్కుల రవి, రజాలీ ఇతర నాయకుల ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. నయీంనగర్‌లోని తనను ఇంట్లో పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించారు.


Updated Date - 2021-01-20T05:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising