ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలోకి ఈటల ఎందుకు పోయాడు: వీహెచ్

ABN, First Publish Date - 2021-10-22T22:59:20+05:30

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎందుకు పోయాడని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి  ఎందుకు పోయాడని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వి. హన్మంతరావు ప్రశ్నించారు.  ఉప ఎన్నిక సందర్భంగా హుజురాబాద్‌లో వీహెచ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కి, ఈటలకి మధ్య వచ్చిన తగాదానే హుజురాబాద్  ఉప ఎన్నిక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈటలకి మంచి పేరు ఉండే అని, బీజేపీలోకి ఎందుకు పోయాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఈటెల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీలో చేరితే ఈటెలకు ఓటు ఎలా వేస్తారని ఆయన విమర్శించారు.


దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ మాత్రం ఆపలేదని, టీఆర్‌ఎస్, బీజేపీ వారే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొన్ని కులాలు ఇంకా అడుక్కుతింటున్నాయని, వారికి కూడా దళిత బంధును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. కేసీఆర్‌కి చిత్త శుద్ధి లేదన్నారు. దళితులకు 3 ఎకరాలు, దళిత సీఎం అని మోసం చేసారని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్కిరికి 15 లక్షలు ఇస్తానని మోదీ మోసం చేశారని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-22T22:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising