ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరల పెంపుపై నిరసన

ABN, First Publish Date - 2021-06-12T05:24:07+05:30

పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు పంపు, ప్రధాన రహదారుల వద్ద కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

నక్కలగుట్ట పెట్రోల్‌పంపు వద్ద నిరసన కార్యక్రమంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకోలు
    హన్మకొండలో కట్టెల పొయ్యి వెలిగించి నిరసన
    పోలీసులతో వాగ్వాదం, స్వల్ప ఉద్రికత్త

  • వరంగల్‌ సిటీ, జూన్‌ 11: పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు పంపు, ప్రధాన రహదారుల వద్ద కాంగ్రెస్‌ నాయకులు నిరసన  కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్ట  పెట్రోల్‌పంపు వద్ద నిరసన చేపట్టారు. నల్లజెండాలు ప్రదర్శించారు. రాస్తారోకో నిర్వహించారు. కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపారు.


  • ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రఽ దానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రజల బతుకులు చి ధ్రం అయ్యాయని ధ్వజమెత్తారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోలు ధరలు వంద రూపాయలకు చేరడం దురదృష్టకరమన్నారు. కరోనా ప్రజలు అల్లాడుతుంటే మోదీ సర్కారు పెట్రోల ధరలను నియంత్రించకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నిరుపేదలు కనీసం ఒక్కపూట తిండికి నోచుకోని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో పెట్రో ధరలు రూ.60కి మించలేదన్నారు. అచ్చేదిన్‌ అంటే ధరలు పెంచడమేనా అని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. జీఎ్‌సటీ ప్రవేశపెట్టి ప్రజల నడ్డీ విరిచారని దుయ్యబట్టారు. కరోనా, బ్లాక్‌ ఫంగ్‌సల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.  పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.





  • రాస్తారోకో క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. స్వ ల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ నాయకులను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసన కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్‌, ఈవీ శ్రీనివాస్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, మీసాల ప్రకాశ్‌, బిన్నీ లక్ష్మణ్‌, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమన్నారాయణ, మహ్మద్‌ ఆయూబ్‌, డాక్టర్‌ పెరుమాండ్ల రామక్రిష్ణ, కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T05:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising