ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి చందూలాల్‌ మృతి పట్ల పలువురు మంత్రుల సంతాపం

ABN, First Publish Date - 2021-04-16T20:57:24+05:30

మాజీ మంత్రి చందూలాల్‌ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మాజీ మంత్రి చందూలాల్‌ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మంత్రి, ప్రజా ప్రతినిధిగా నియోజక వర్గానికి చేసిన సేవలే కాదు, జిల్లా అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారని అన్నారు. ఈసందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. రాష్ట్ర తొలి గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కేసీఆర్‌ కేబినెట్‌లో పనిచేసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 


ఈసందర్భంగా పర్యావరణ, అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ చందూలాల్‌ మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మంత్రిగా చేసిన సేవలు మురువలేమని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాభ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే మాజీ మంత్రి చందూలాల్‌ మృతి టీఆర్‌ఎస్‌కు తీరని లోటని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. చందూలాల్‌ కుటుంబానికి సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-16T20:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising