ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదుల వెల్లువ

ABN, First Publish Date - 2021-07-30T23:46:15+05:30

సచివాలయంలో సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సచివాలయంలో సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ అపాయింట్‌మెంట్ కోసం సెక్రెటేరియేట్‌లోని పేషీని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంప్రదిస్తున్నారు. అత్యవసరం కోసం ఎవరైనా సచివాలయంలో ఉన్న నెంబర్‌ను సంప్రదిస్తే ఎవరికి అయినా కాంటాక్ట్ నంబర్ ఇచ్చేవారు. గతంలో ఉన్న నంబర్లనే సామాన్య ప్రజలు సంప్రదిస్తున్నారు. ఉన్న పాత నంబర్లనే వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సంబంధిత కార్యాలయలకు బీఆర్కే భవన్ సీఎం పేషీ అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే ఇతర శాఖల సిబ్బంది స్పందించడం లేదు. దీంతో సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో  బీఆర్కే భవన్‌లో ఉన్న సీఎం పేషీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.


సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ నంబర్‌ ( 04023403999  ప్రగతి భవన్ నంబర్ )ను బీఆర్కే భవన్ సీఎం పేషీ సిబ్బంది ఇస్తున్నారు. అయితే బీఆర్కేభవన్లో ఉన్న నంబర్(  04023456698 )ను తిరిగి  కాంటాక్ట్ చేయాలని సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బంది చెప్తున్నారు. దీంతో తమ సమస్యలు ఎలా షరిష్కారం అవుతాయో తెలియక సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-07-30T23:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising