ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈ-ఆఫీస్‌’గా వ్యవసాయ కమిషనరేట్‌

ABN, First Publish Date - 2021-11-27T09:04:48+05:30

వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ‘ఈ-ఆఫీ్‌స’గా రూపుదిద్దుకుంటోంది. మాన్యువల్‌గా ఉన్న ఫైళ్లన్నీ స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాన్యువల్‌ దస్ర్తాలన్నీ ఆన్‌లైన్‌

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ‘ఈ-ఆఫీ్‌స’గా రూపుదిద్దుకుంటోంది. మాన్యువల్‌గా ఉన్న ఫైళ్లన్నీ స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మూడో అంతస్థును ఆధునీకరిస్తున్నారు. కమిషనరేట్‌లోని అన్ని కంప్యూటర్లలో మొదట ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. కమిషనరేట్‌కు వివిధ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు, ఫైళ్లను ఇన్‌వార్డు విభాగంలో స్కాన్‌ చేస్తారు. వాటికి నెంబర్‌ కేటాయించి ఆయా విభాగాలకు ఆన్‌లైన్‌లో పంపుతున్నారు. ఈ-ఫైలింగ్‌ విధానం ద్వారా అవి ఒక అధికారి నుంచి ఇంకో అధికారికి, చివరగా కమిషనర్‌కు చేరతాయి. కమిషనర్‌ ఆమోదం పొందిన తర్వాత ఫైళ్లు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. దీంతో ఫైళ్లు వేగంగా కదిలే అవకాశం ఉంటుంది. మొదట కమిషనరేట్‌లో, తర్వాత రాష్ట్రమంతటా ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రైతు బీమా, రైతుబంధు డేటా సకరణ వంటి పనులు ఆన్‌లైన్‌ ద్వారా వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఇతర విభాగాల ఉద్యోగులు, అధికారులు ఈ- ఆఫీస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాలనావ్యవహారాలు చేయాలని కమిషనర్‌ నిర్ణయించారు.

Updated Date - 2021-11-27T09:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising