ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల్లో సింగరేణి కార్మికులందరికీ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-04-23T09:55:09+05:30

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణివ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. ప్రతి రోజూ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1200 బెడ్లు సిద్ధం చేయాలని సీఎండీ శ్రీధర్‌ ఆదేశం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణివ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. ప్రతి రోజూ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించడంతోపాటు రోజుకు 2 వేల మంది చొప్పున 30 రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి సంస్థ డైరెక్టర్లు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సింగరేణి ఆస్పత్రుల్లో 692 బెడ్లు ఉన్నాయని, వీటిలో 312 బెడ్‌లను క్వారంటైన్‌ కోసం ఉంచాలని, 387 బెడ్‌ల ను కొవిడ్‌ ప్రత్యేక వార్డు కోసం సిద్ధం చేస్తూ..  అదనంగా మరో 500 బెడ్లను వెంటనే సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 95 వేల మందికి పరీక్షలు నిర్వహించామని, మరో 25 వేల పరీక్షల నిర్వహణకు కిట్ల కోసం వైద్య శాఖ మంత్రిని కోరతానని తెలిపారు.  

Updated Date - 2021-04-23T09:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising