ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లికి భద్రతా సిబ్బంది బ్రేక్‌

ABN, First Publish Date - 2021-01-20T05:14:42+05:30

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూపాయింట్‌ ద్వారా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం వ్యూపాయింట్‌ నుంచి మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైకి ప్రత్యేక వాహనంలో వెళ్లేందుకు సిద్ధం కాగా అందులో ఎక్కేందుకు మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అక్కడకు వ చ్చారు.

సీఎం ప్రత్యేక వాహనం వద్ద నుంచి వెనుదిరిగిన మంత్రి ఎరబెల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌ రూరల్‌, జనవరి 19 : కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూపాయింట్‌ ద్వారా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం వ్యూపాయింట్‌ నుంచి మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైకి ప్రత్యేక వాహనంలో వెళ్లేందుకు సిద్ధం కాగా అందులో ఎక్కేందుకు మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అక్కడకు వ చ్చారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వారు  ప్రత్యేకవాహనంలోకి ఎక్కేందుకు అనుమతిని నిరాకరించారు. దీంతో  దయాకర్‌రా వు,  సుమన్‌ అక్కడ నుంచి వెనుదిరిగి కాన్వాయ్‌ వైపునకు వెళ్లిపోయారు. కాగా అప్పటికే సీఎం ప్రత్యేక వాహనంలోకి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఎక్కారు.

భూనిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు

మహదేవపూర్‌ రూరల్‌, జనవరి 19 : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి భూములిచ్చిన ప్రతి రైతు కుంటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలనుకున్న అంబట్‌పల్లి, సూరారం గ్రామాలకు చెందిన భూనిర్వాసితులకు నిరాశే ఎదురైంది. వారిని పోలీసులు గ్రామాల్లోనే అడ్డుకున్నారు. తాము ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలనుకున్నామని, అధికారులు తమ గోడును ఆయన ఆలకించకుండా అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. సీఎంకు వినతిపత్రం అందించాలనుకున్న వారిలో నాగుల అశోక్‌, చల్ల చంద్రయ్య, చీర్ల తిరుపతి, చల్ల దేవేందర్‌, చల్ల రమేష్‌, చల్ల శ్రావణ్‌, సల్ల మహేష్‌, సూరం నగేష్‌, పడాల వెంకటయ్య, నారం సతీష్‌, బాసాని సంతోస్‌, నారం రాజయ్య తదితరులు ఉన్నారు.


8 గ్రామాలకు కరెంటు కట్‌
మహదేవపూర్‌, జనవరి 19: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అధికారుల తీరుతో భక్తులు, సమీప గ్రామాల ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. సీఎం వచ్చే హెలీకాప్టర్‌కు విద్యుత్‌ తీగలు అతి సమీపంలో ఉన్నాయని భావించిన అధికారులు పలుగుల గ్రామం వైపు వెళ్లే విద్యుత్‌ స్తంభాలను, తీగలను తీసివేశారు. దీంతో పలుగుల, కుంట్లం, మద్దులపల్లి, సండ్రుపల్లి, అన్నారం, నాగెపల్లి, పూస్కుపల్లి, మజీదుపల్లి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయాక యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Updated Date - 2021-01-20T05:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising