ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచికల్‌పేటలో సీఎం సభ రద్దు

ABN, First Publish Date - 2021-10-22T05:12:29+05:30

పెంచికల్‌పేటలో సీఎం సభ రద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఎన్నికల కమిషన్‌ తాజా ఉత్తర్వులే కారణం

 ఓరుగల్లు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈనెల 27న జరగాల్సిన సీఎం కేసీఆర్‌ అభినందన సభ  కేంద్ర ఎన్నికల కమిషన్‌ తాజా ఉత్తర్వులతో రద్దయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట గ్రామంలో పెద్దఎత్తున సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు విస్తృత ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారసభలాగా కాకుండా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సంధర్బంగా అభినందన సభ పేరుతో సభను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందుకోసం హుజురాబాద్‌ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతంలోని పెంచికలపేట గ్రామ శివారులో సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల కోడ్‌కు సంబంధించి నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్‌, హనుమకొండ జిల్లాలు పూర్తిస్థాయిలో కోడ్‌ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో సభ రద్దయింది. అయితే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో ఉండే అవకాశాలున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-10-22T05:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising