ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-10-12T01:54:43+05:30

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిశారు. సీఎం వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈసందర్భంగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ దంపతులను చినజీయర్‌ స్వామి శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల నేపద్యంలో, హరితహారం స్పూర్గిఆ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టిన ఊరు ఊరుకు జమ్మిలో భాగంగా కుటీర ప్రాంగణంలో జీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ జమ్మిమొక్కను నాటారు. 


హరితహారం స్పూర్తితో గ్రేట్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతో చేస్తున్నారని అభినందిస్తూ సంతోష్‌ కుమార్‌ కృషిని చినజీయర్‌ స్వామికి సీఎం కేసీఆర్‌ పరిచయం చేశారు. మొక్కలు నాటడంతో పాటు జమ్మి మొక్కను నాటే ఆలోచన గొప్పదని, సంతోష్‌ కుమార్‌ను ఈసందర్భంగా చినజీయర్‌ స్వామి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, సతీమణి శోభమ్మ దంపతులతో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, టీటీడీ బోర్డు సభ్యుడు, మైహోమ్స్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కావేరీ సీడ్స్‌ భాస్కర్‌ రావు,జిల్లా కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌ స్టీఫిన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-12T01:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising