మాతృమూర్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2021-05-10T08:04:06+05:30
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని పేర్కొన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో గుణాలను మనం తల్లి నుంచి నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలలో మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు.
Updated Date - 2021-05-10T08:04:06+05:30 IST