ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమోచన దినోత్సవాన చిన్నజీయర్‌తో కేసీఆర్ యాదాద్రి పర్యటన

ABN, First Publish Date - 2021-09-14T00:50:09+05:30

విమోచన దినోత్సవాన చిన్నజీయర్‌తో కేసీఆర్ యాదాద్రి పర్యటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈనెల 17న మరోసారి చినజీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. 


యాదాద్రి పున:నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఆలయ నిర్మాణ పనులను శరవేగంగా జరిగాయి. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు యాదాద్రిని సందర్శించారు. త్వరలో యాదాద్రి ఆలయాన్ని పున:ప్రారంభించనున్నారు. చోళ, కాకతీయ , పల్లవ కళాకృతులతో ఈ ఆలయ పున: నిర్మాణ పనులు జరిగాయి. త్వరలో యాదాద్రి ఆలయాన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేయాలని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఇప్పటికే ఆహ్వానించారు. 


ఈ తరుణంలో బీజేపీ  సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తుండగా కేసీఆర్.. చిన్నజీయర్ స్వామితో కలిసి యాదాద్రిని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


Updated Date - 2021-09-14T00:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising