ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ టగ్‌ ఆఫ్‌ వార్‌లో సీఎం కేసీఆర్‌ బిజీ

ABN, First Publish Date - 2021-05-08T08:20:04+05:30

తెలంగాణలో కరోనా కోరలు చాస్తుంటే.. కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ టగ్‌ ఆఫ్‌ వార్‌లో బిజీగా ఉన్నారని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్రాంత ఐపీఎస్‌ వీకే సింగ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా కోరలు చాస్తుంటే.. కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ టగ్‌ ఆఫ్‌ వార్‌లో బిజీగా ఉన్నారని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌ ఆరోపించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్లు దొరక్క.. కరోనా రోగులు మృతి చెందుతున్నారని, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మృగ్యమయ్యాయని విమర్శించారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా అదుపులో ఉందని ప్రకటించడం విడ్డూరమని ఓ ప్రకటనలో అన్నారు. ‘‘పరిస్థితిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి.. అందరి దృష్టిని మళ్లించేందుకు మొదట హెల్త్‌ సెక్రటరీని తప్పించారు. ఆ తర్వాత ఆరోగ్య మంత్రిని తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విశ్వసనీయతకు ప్రమాదం పొంచి ఉంది. కేసుల సంఖ్యను దాచడం వల్ల కరోనా తీవ్రత తగ్గదు. తప్పుడు ప్రకటనలు మానుకోవాలి. విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం విఫలమైందనే ప్రతిపక్షాల వాదనను వీకే సింగ్‌ ఖండించారు. గడిచిన 60 ఏళ్లలో ఆరోగ్య, మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే.. ఈ పరిస్థితులు ఎదురయ్యేవి కావన్నారు.

Updated Date - 2021-05-08T08:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising