ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మ గౌరవంతో బతకాలని...భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2021-09-18T03:32:27+05:30

తెలంగాతణ ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలని తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్: తెలంగాతణ ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలని తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్ ఇచ్చిందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో సీఎం ఇలాకా గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 అత్యంత పవిత్రమైన రోజని, ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏడూ ఏళ్లుగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని భట్టి ఆరోపించారు.


18 లక్షలు కుటుంబాలకి దళిత బంధు అమలు చేయాలంటే లక్ష 80 వేలు కోట్లు అవుతాయన్నారు. నాలుగు మండలాలలో దళిత బంధు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఇచ్చిన అబద్ధపు హామీల లాగా ఈ హామీ మిగిలిపోకూడదన్నారు. దళిత బంధుకి నిధులు ఎప్పుడు కేటాయిస్తారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. అన్ని వర్గాలలో ఉన్న పేదవారికి ఇటువంటి పథకం అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాలలో డిమాండ్ చేస్తున్నామన్నారు.  

Updated Date - 2021-09-18T03:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising