ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్రానిదే: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2021-11-20T00:25:32+05:30

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం లో నైనా రాష్ట్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లా: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం లో నైనా రాష్ట్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం ఉంది. ధాన్యాన్ని కొనుగోలు చేసే శక్తి కూడా ఉంది.ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా పారదోలేమో టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాన్ని కూడా అలానే నా పరదోలే పరిస్థితి  ఏర్పడిందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 


అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో పాటు మిల్లర్లుతో కుమ్మక్కు కావడమే ఈ కొనుగోలు కేంద్రాలం ఏర్పాటు ఆలస్యనికి  కారణమని దుయ్యబట్టారు. రైతు పండించిన ధాన్యానికి కమీషన్ల కోసం తరుగు పేరుతో దోపిడీ జరుగుతున్న సంస్కృతి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందని, ధాన్యం అమ్ముకునేందుకు 25 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రం లోని వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తీవ్ర వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


 రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కుప్పల మీద పడుకొని గుండెపోటుతో రైతులు మృతి చెందుతున్నారని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల నుంచి పంట కొనాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమేనని స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ఆరోపించారు.ప్రభుత్వం ఇలానే చేస్తే రైతులంతా కలిసి పెద్ద ఉద్యమం చేపట్టి ప్రభుత్వం అనేది లేకుండా చేయటం ఖాయమన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితమేనని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.  

Updated Date - 2021-11-20T00:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising