ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే బియ్యం: మారెడ్డి

ABN, First Publish Date - 2021-01-20T20:31:21+05:30

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే బియ్యం: మారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే  పౌరసరఫరాల శాఖ బియ్యం సరఫరా చేస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంస్థ చైర్మన్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్నసందర్భంగా ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే సరఘా చేస్తోందన్నారు.


ప్రతినెల 87.54 లక్షల కుటుంబాలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని, అలాగే సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఏడాదికి లక్షా 20వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఈ బియ్యం క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని ఉద్యోగులకు సూచించారు.


ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది వానాకాలంలో గత ఏడాది వానాకాలం మార్కను దాటడం జరిగింది. గత ఏడాది 47.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 11 లక్షల మంది రైతుల నుండి 6,505 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 9వేల కోట్లు విలువచేసే 47.87లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రూ.8375 కోట్ల రూపాయలను నేరుగా రైతు ఖతాలో జమచేశామని తెలిపారు.


Updated Date - 2021-01-20T20:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising