ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ షాపులకు బోర్దులుండాల్సిందే పౌరసరఫరాల ఎన్ఫోర్స్ మెంట్ డిటీ రఘునందన్

ABN, First Publish Date - 2021-02-25T23:55:06+05:30

రేషన్ షాపులకు బోర్డులు పెట్టకపోతే చర్యలు తప్పవు అని పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ నారాయణ పేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయణపేట: రేషన్ షాపులకు బోర్డులు పెట్టకపోతే చర్యలు తప్పవు అని పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ నారాయణ పేట జిల్లా డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. ప్రజా పంపిణీ ముగిసింది ఇక హాయిగా సేద తీరవచ్చు అని భావించిన డీలర్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు డీ టీ రఘునందన్. గురువారం చౌక దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.బస్సు సైతం వెళ్లలేని మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్లి , ఆ..ఈ ఊరికి సారు వస్తారా అని రారు!అనుకున్న గ్రామాలకు వెళ్లి మరీ సర్..ప్రైజ్ ఇచ్చారు.


డీలర్ల అలసత్వం , నిర్లక్ష్యం  ఉపేక్షించేది లేనే లేదని నిర్ద్వదంగా స్పష్టం చేశారు. దుకాణాలు దుమ్ము , బూజు పట్టకుండా శుభ్రత చర్యలు నైతిక బాధ్యత గా చేపట్టాలని ఆదేశించారు.నారాయణ పేట జిల్లా మారుమూల కుగ్రామం తగిన రోడ్డు సౌకర్యం కూడా లేక బస్సు వెళ్లలేని గ్రామాలను సైతం రఘునందన్ సందర్శించారు. అన్నీ సక్రమంగా ఉన్న గుడే బల్లుర్ రేషన్ షాపును శభాష్ అంటూ కితాబు నిచ్చారు.


బోర్డులు సక్రమంగా ఎర్పాటు చేసుకుని సరకుల వివరాల ను నమోదు చేయాలని సూచించారు. కృష్ణా, హిందూపూర్ , కున్సి,ఆలంపూర్, గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముగింపు నిల్వల వివరాలను పరిశీలించారు. దుకాణాలను బినామీలు నడిపిస్తే...బేడీలు ఖాయమని అన్నారు. ప్రతిష్టాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ ను పరిహాసం. చేస్తే, పరిహారం, శిక్ష తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ప్రజా పంపిణీ బియ్యం ను అలాగే ఎక్కువ కాలం నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - 2021-02-25T23:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising