ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో పెళ్లి పేరుతో భారీ మోసం

ABN, First Publish Date - 2021-06-20T02:45:10+05:30

నగరంలో మరో ఘరానా సైబర్ మోసం జరిగింది. రెండో పెళ్లి పేరుతో సైబర్ నేరగాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో మరో ఘరానా సైబర్ మోసం జరిగింది. రెండో పెళ్లి పేరుతో సైబర్ నేరగాడు భారీగా డబ్బులు కొల్లగొట్టాడు. యాభై లక్షల రూపాయలను సైబర్ కేటుగాడు కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ‌లో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు.


 ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను ఎయిర్ కొరియర్ ద్వారా పంపిస్తున్నానని ఆ మహిళను నమ్మించాడు. ఒక మహిళ చేత ఢిల్లీ కస్టమ్స్ అధికారినంటూ ఫోన్ చేయించి ట్యాక్సుల చెల్లింపు పేరుతో తాను చెప్పిన అకౌంట్‌కు యాభై లక్షల రూపాయలను కేటుగాడు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. తరువాత ఆ కేటుగాడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని ఆ మహిళ గ్రహించింది. దీంతో తనకు జరిగిన మోసంపై  సైబర్  క్రైమ్స్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-06-20T02:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising