ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతున్న అంగన్‌వాడీల రూపురేఖలు

ABN, First Publish Date - 2021-09-03T08:52:20+05:30

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు అవి చిన్నారుల సంరక్షణ, పోషకాహారం అందించే కార్యక్రమాలకే పరిమితం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేసేలా చర్యలు..

ఇంగ్లీష్‌ మీడియంపై మొదలైన కసరత్తు 8 పాఠశాలలతో అనుసంధానం


హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు అవి చిన్నారుల సంరక్షణ, పోషకాహారం అందించే కార్యక్రమాలకే పరిమితం కాగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా మార్చనున్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చిన ప్రభుత్వం చిన్నారులు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దింది. త్వరలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇంగ్లీషు మీడియం అమలుకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అయితే మెజారిటీ కేంద్రాల్లో పదోతరగతి, ఇంటర్‌ చదివినవారు అంగన్‌వాడీ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీరి ద్వారా ఇంగ్లీష్‌ మీడియం విద్య ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయాన్నీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ‘‘అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టాలనే అంశం ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. ఇందుకు సంబంధించి విధివిధానాలు పూర్తి కావాల్సి ఉంది.’’ అని మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-03T08:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising