తీగల కృష్ణారెడ్డికి రూ.1000 చలానా విధించిన పోలీసులు
ABN, First Publish Date - 2021-05-11T18:32:59+05:30
రాచకొండ: మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో చలానా విధించారు. మాస్క్ ధరించని తీగలకు సరూర్ నగర్ పోలీసులు
రాచకొండ: మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో చలానా విధించారు. మాస్క్ ధరించని తీగలకు సరూర్ నగర్ పోలీసులు 1000 రూపాయల చలానా విధించారు. కర్మాన్‌ఘాట్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టిన సరూర్ నగర్ పోలీసులు మాస్కు లేకుండా తీగల కృష్ణారెడ్డి కారులో వెళుతుండటాన్ని గుర్తించారు. సబ్ ఇన్స్పెక్టర్ ముఖేష్‌కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అందరూ సమానమేనని పోలీసులు వెయ్యి రూపాయల చలానా విధించారు.
Updated Date - 2021-05-11T18:32:59+05:30 IST