ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ బచావో అన్నట్లుగా... కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-08T00:22:26+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం ప్రభుత్వ వైఖరిపై కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం ప్రభుత్వ వైఖరిపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం  విషయంలో కిసాన్ బచావో అన్నట్టుగా లేదు.. కేసీఆర్ బచావో అన్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్‌ ఓర్వలేకపోతోందన్నారు. కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒప్పందం ప్రకారం రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్తోందన్నారు. రైతులకు కేంద్రం అన్యాయం చేయదని ఆయన స్పష్టం చేశారు.


కేంద్రంపై కేసీఆర్‌ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారన్నారు. రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చే చర్యలు చేయొద్దన్నారు. రా రైస్ ప్రతి గింజను కేంద్రం కొంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 




Updated Date - 2021-12-08T00:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising