ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కేసులు తగ్గడంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హర్షం

ABN, First Publish Date - 2021-05-13T01:57:09+05:30

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం పట్ల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం పట్ల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు త్వరగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో 18,232 ఉన్న బెడ్లను, 53,775కి పెంచామని హరీశ్ తెలిపారు. ఆక్సిజన్ బెడ్లను 9213 నుంచి 20738కి పెంచామని హరీశ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3264 ఉన్న ఐసీయూ బెడ్లను 11274 కు పెంచగలిగామని తెలిపారు. ఇప్పటి వరకూ 60 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించామని హరీశ్ రావు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్సల వ్యాక్సిన్లతో పాటు రెండు వేల వెంటిలేటర్లు తక్షణమే ఇవ్వాలని తాము కేంద్ర మంత్రిని కోరామని హరీశ్ వెల్లడించారు. 

Updated Date - 2021-05-13T01:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising