ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 2024లో బీజేపీదే అధికారం: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా

ABN, First Publish Date - 2021-09-17T21:49:00+05:30

రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో జరిగిన  బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత  సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మజ్లిస్‌కు భయపడేది లేదని ఆయన ప్రకటించారు.  ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు.  సర్దార్ పటేల్ పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు.



బండిపై ప్రశంసల జల్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్ ఇపుడు మరిచిపోయారన్నారు. 


రాజేందర్‌ను గెలిపించవడి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను అమిత్ షా కోరారు.

Updated Date - 2021-09-17T21:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising