ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: కొన్ని జిల్లాల్లో ఇంకా అదుపులోకి రాని కరోనా

ABN, First Publish Date - 2021-07-20T19:58:49+05:30

హైదరాబాద్: కరోనా లేదు.. గిరోనా లేదు.. అన్నట్లుగా జనం తిరుగుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా లేదు.. గిరోనా లేదు.. అన్నట్లుగా జనం తిరుగుతున్నారు. ‘నో మాస్క్.. నో సోషల్ డిస్టెన్స్..’ ఎక్కడ చూసినా జనమే జనం.. పండుగలైనా షాపింగ్‌లైనా, సరదాలైనా.. దేనికి తగ్గేదేలేదన్నట్లుగా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా కేసులు ఎక్కడ పెరుగుతాయోనని ఆరోగ్యశాఖ అధికారులు హడలెత్తిపోతున్నారు. తెలంగాణలో నిత్యం వెయ్యిలోపు పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు తగ్గినట్లే కనిపిస్తున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. దీనికి తోడు బోనాలు, బక్రీద్ పండుగలు రావడం, ఆషాఢం షాపింగ్ సందడి మరోవైపు.. త్వరలోనే సినిమా థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయి.


 ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కరోనా విలయం సృష్టించినా ప్రజల్లో భయం ఏమాత్రం లేదు. అలాగే ఉంటే.. థర్డ్ వేవ్‌లో జనం భారీ మూల్యం చెల్లించకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా స్వైరవిహారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఐదారు జిల్లాల్లో ఇప్పటికీ వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్ అర్బన్, కరీంనగర్, మంచిర్యాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో 11 క్లస్టర్ ప్రాంతాలను అధికారులు గుర్తించారు.

Updated Date - 2021-07-20T19:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising