ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులు లేక 28 రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2021-05-07T09:50:44+05:30

ప్రయాణికుల ఆదరణ లేక, నిర్దేశిత లక్ష్యం మేర ఆదాయం రాక 28 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 7న నడిచే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల ఆదరణ లేక, నిర్దేశిత లక్ష్యం మేర ఆదాయం రాక 28 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 7న నడిచే తిరుపతి-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-కర్నూల్‌ సిటీ, కర్నూల్‌ సిటీ-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందెడ్‌-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌, చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, నర్సాపూర్‌-నాగర్సోల్‌, సికింద్రాబాద్‌-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ ట్రెయిన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.


ఈ నెల 8న నడిచే విశాఖపట్నం-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్‌, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్‌, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌, నాగర్సోల్‌-నర్సాపూర్‌ ట్రెయిన్లు రద్దయ్యాయని తెలిపింది. ఈ నెల 9న నడిచే కాకినాడ టౌన్‌-లింగంపల్లి, కరీంనగర్‌-తిరుపతి, జమ్ముతావి-నాందెడ్‌, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, ఈ నెల 10న నడిచే లింగంపల్లి-కాకినాడ టౌన్‌ రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొంది.

Updated Date - 2021-05-07T09:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising