ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ అభివృద్ది సంస్థకు కెనరా బ్యాంక్ విరాళం

ABN, First Publish Date - 2021-10-14T00:44:39+05:30

సామాజిక బాధ్యతలో భాగంగా (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కెనరా బ్యాంక్ అధికారులు పది లక్షల రూపాయల విలువైన పరికరాలను అటవీ అభివృద్ది సంస్థకు అందించారు. హైటెక్ సిటీ, కొత్తగూడ సమీపంలో ఉన్న బొటానికల్ గార్డెన్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్) నిర్వహణకు ఒక ట్రాక్టర్ తో పాటు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సామాజిక బాధ్యతలో భాగంగా (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కెనరా బ్యాంక్ అధికారులు పది లక్షల రూపాయల విలువైన పరికరాలను అటవీ అభివృద్ది సంస్థకు అందించారు. హైటెక్ సిటీ, కొత్తగూడ సమీపంలో ఉన్న బొటానికల్ గార్డెన్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్) నిర్వహణకు ఒక ట్రాక్టర్ తో పాటు, వాటర్ ట్యాంకర్ ను కెనరా బ్యాంకు అందించింది. బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కే.హెచ్. పట్నాయక్ చేతుల మీదుగా ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి వీటిని అందించారు.


శరవేగంగా అభివృద్ది చెందుతున్న సైబరాబాద్ కు బొటానికల్ గార్డెన్ ఒక విలువైన ప్రకృతి సంపద అని, దానికి కాపాడటంలో భాగంగా తమ వంతుగా సామాజిక బాధ్యతా నిధుల నించి పది లక్షల రూపాయల విలువైన పరికరాలు అందించినట్లు కెనరా బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంకు ప్రతినిధులు, కార్పోరేషన్ అధికారులు కలిసి పార్క్ లో మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, (ఎం.డీ) జీ. చంద్రశేఖర్ రెడ్డి, జీ.ఏం. రవీందర్ రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు భాస్కర చక్రవర్తి, మమతా జోషి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,  బొటానికల్ గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T00:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising