ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద కామెంట్లు

ABN, First Publish Date - 2021-03-05T08:59:18+05:30

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ) వివాదాస్పద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కుక్కపై ప్రేమ ప్రజలపై చూపగలరా?


హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మేయర్‌ ఓ చేత్తో కుక్కకు.. మరో చేత్తో తాను తింటున్నట్లు వైరల్‌ అయిన వీడియోపై ఆర్జీవీ స్పందిస్తూ..  ‘‘కుక్కపై మేయర్‌ ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంది.. కుడి చేత్తో కుక్కకు తినిపిస్తూ ఎడమ చేత్తో తాను తింటున్నారు. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఆమె కుక్కపై చూపుతున్న ప్రేమకు దీటుగా ప్రజలను ప్రేమించగలరా? కుక్కను ఆమె అంతగా ప్రేమించడాన్ని చూస్తుంటే మరో జన్మలో తాను కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను.


ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా కుక్కను చూసి అందరూ ఈర్ష్య చెంది ఉంటారు’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 



Updated Date - 2021-03-05T08:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising