ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదలైన క్యాంపు రాజకీయం

ABN, First Publish Date - 2021-11-30T00:01:46+05:30

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు గోవా క్యాంపునకు తరలిస్తోంది. జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బస్సులు ద్వారా హైదరాబాదుకు అక్కడినుంచి కొందరు సభ్యులను విమానంలో, మరికొందరిని బస్సుల్లో గోవాకు పంపిస్తున్నారు. డిసెంబరు 8వరకు గోవా క్యాంపులోనే ఉండి ఆ తర్వాత 10వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కోండ్రు సుధారాణి బరిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 787 ఓట్లకుగాను 18 ఎంపీటీసీలు ఖాళీగా ఉండడంతో 769మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Updated Date - 2021-11-30T00:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising