ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానం ఎక్కాలంటే కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు తీసుకు రండి

ABN, First Publish Date - 2021-03-08T09:01:08+05:30

కోల్‌కతా వెళ్లడానికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు ఎయిరిండియా తీరు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎయిరిండియా నిబంధన
  • శంషాబాద్‌ లో  ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 7: కోల్‌కతా వెళ్లడానికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు ఎయిరిండియా తీరు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్‌-19 టెస్టు రిపోర్టు లేదని ఆదివారం ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయాణానికి అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగి, ఆ ఎయిర్‌లైన్స్‌ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో ఓ విద్యార్థిని కోల్‌కతాలో పరీక్షలు రాసేందుకు వెళ్లాల్సి ఉంది. తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తరువాత రిపోర్ట్‌ తీసుకురావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని అధికారులను విద్యార్థిని ప్రశ్నించింది.   సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కోల్‌కతాకు వచ్చే ప్రయాణికుల వద్ద ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా ఉండాలని  ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోల్‌కతాలో కొవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరిగాయని, అందుకోసమే ఆర్టీపీసీఆర్‌ నిబంధన తప్పనిసరి చేసిందని తెలిపారు. 

Updated Date - 2021-03-08T09:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising