ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకాలు మంచిని బోధిస్తాయి

ABN, First Publish Date - 2021-12-19T07:26:47+05:30

సామాజిక మాధ్యమాలు చెడును ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయని, పుస్తకాలు మాత్రం మంచిని బోధిస్తాయని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సోషల్‌ మీడియాతో ఎక్కువగా చెడు ప్రచారం: శ్రీనివాస్‌ గౌడ్‌
  • 34వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభం


హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలు చెడును ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయని, పుస్తకాలు మాత్రం మంచిని బోధిస్తాయని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. వార్తా పత్రికల్లోని ఎడిట్‌ పేజీ వ్యాసాలను యువత చదవాలని, తద్వారా సమాజాన్ని వాస్తవికంగా విశ్లేషించే దృక్పథం అలవడుతుందని సూచించారు. స్థానిక దోమల్‌గూడ ఎన్టీఆర్‌ స్టేడియంలో నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంలోని చిందు ఎల్లమ్మ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి 34వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవాన్ని శ్రీనివాస్‌ గౌడ్‌ శనివారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పుస్తకం ప్రధాన పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీకి శాశ్వత కార్యాలయాన్ని కేటాయించాల్సిందిగా ఆ సంస్థ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ మంత్రిని కోరారు. రవీంద్రభారతిలో కార్యాలయానికి స్థలం కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ‘వికీపీడియా’లో తెలంగాణ సమాచారాన్ని తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీశాఖ కార్యదర్శి జయే్‌షరంజన్‌ అన్నారు. 

Updated Date - 2021-12-19T07:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising