ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరవరరావుకు మరింత ఊరట!

ABN, First Publish Date - 2021-10-27T08:40:36+05:30

ఎల్గార్‌ పరిషద్‌ కేసులో నిందితుడైన కవి వరవరరావుకు మరికొంతకాలం ఊరట లభించింది. నవంబరు 18వరకు ఆయన తలోజా జైలు అధికారుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వచ్చే 18 వరకు లొంగిపోనక్కర్లేదు


ముంబై, అక్టోబరు 26: ఎల్గార్‌ పరిషద్‌ కేసులో నిందితుడైన కవి వరవరరావుకు మరికొంతకాలం ఊరట లభించింది. నవంబరు 18వరకు ఆయన తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోనక్కర్లేదని బాంబే హైకోర్టు మంగళవారం తెలిపింది. అస్వస్థత కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆయనకు హైకోర్టు మెడికల్‌ బెయిలు మంజూరు చేసింది. సెప్టెంబరు 5న ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. తన మెడికల్‌ బెయిలును పొడిగించాల్సిందిగా కోరుతూ వరవరరావు గత నెలలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండేందుకు ఆయన అనుమతి కోరారు. సమయభావం కారణంగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మెడికల్‌ బెయిలు సమయంలో స్వస్థలంలో ఉండేందుకు అనుమతి కోరుతూ విడిగా మరో వ్యాజ్యం వేయాల్సిందిగా ధర్మాసనం వరవరరావుకు సూచించింది.  

Updated Date - 2021-10-27T08:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising