ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌ మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2021-06-02T06:10:42+05:30

రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌ మంజూరు చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2005లోనే ప్రతిపాదనలు చేశాం 

కేంద్రంపై ఒత్తిడికి బీజేపీ నేతలు కలిసి రావాలి

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌

భూపాలపల్లి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లికి ఓ ప్రత్యేకత ఉంద ని, ఇక్కడ అవరమైనంత భూమి,  బొగ్గు, కరెంట్‌, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అన్ని హంగులూ భూపాలపల్లిలో ఉన్నాయని తెలిపారు. రైల్వేలైన్‌ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం మరో అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  రామగుండ-మణుగూరు కోల్‌ కారిడార్‌లో సెంట్రల్‌ పాయింట్‌గా భూపాలపల్లి ఉందన్నారు. ఇండస్ర్టీయల్‌ కారిడార్‌కు కూడా భూపాలపల్లి కేంద్రంగా మారుతుందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌ కోసం ప్రతిపాదనలు పంపించినట్టు గుర్తు చేశారు. అప్పట్లో రైల్వే అధికారులు సర్వే కూడా నిర్వహించారని చెప్పారు. అయినా దాదాపు 20 ఏళ్లుగా రైల్వేలైన్‌కు మోక్షం లభించలేదన్నారు.  రైల్వే లైన్‌ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమతో బీజేపీ నేతలు కలిసి రావాలని కోరారు. 

ధాన్యం కోనుగోళ్లపై కేంద్రం యూటర్న్‌ 

ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకొని, ఎఫ్‌సీఐతో కొనుగోళ్లు చేయించాలని వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో ఈ సీజన్‌లో 74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని తెలిపారు. మరో 12 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం నిల్వలు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉం దన్నారు. ఈ సీజన్‌ అత్యధికంగా 96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. ఈ పెద్ద మొత్తంలో ధాన్యాన్ని రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు మార్కెట్లోకి వెళ్లి విక్రయాలు చేస్తే ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించిందన్నారు. అయితే ఆరు నెలల క్రింతం దొడ్డు వడ్లను కొనుగోలుపై కేంద్రం తో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. కేం ద్రం నిర్ణయంతో ధాన్యాన్ని పెట్టిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను వినియోగించే కేరళ, తమిళనాడులో రెండేళ్లుగా సొంతంగా బాయిల్డ్‌ రైస్‌కు కావాల్సిన పం టలను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. దీంతో పొరుగు రాష్ర్టాలకు విక్రయించుకొనే పరిస్థితి లేక, కేంద్రం కొనుగోలు చేయకోవటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూ రుకుపోవాల్సి వస్తోందన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రం తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పంజాబ్‌ అంటే భయమా..? అని వ్యాఖ్యానించారు. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయించాలని వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. 

సమావేశంలో భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రైతు రుణవిమోచన కమిటీ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, భూపాలపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, వరంగల్‌  కార్పొరేటర్‌ ఇండ్ల నాగేశ్వర్‌రావు, టెకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు మేడిపల్లి శోభన్‌కుమార్‌, సెగ్గం సిద్ధ్దు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-02T06:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising