ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN, First Publish Date - 2021-10-26T05:10:11+05:30

రక్తదానం ప్రాణదానంతో సమానం

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ తరుణ్‌జోషి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి


గీసుగొండ, అక్టోబరు 25: రక్తదానం చేసి ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని వరంగల్‌ సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొనాయిమాకులలోని పీడీఆర్‌ గార్డెన్‌లో మామునూరు డివిజన్‌ స్థాయిలో మెగా రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీ తరుణ్‌ జోషి మాట్లాడుతూ.. పేదల ప్రాణాలను కాపాడేందుకే కమిషనరేట్‌ పరిధిలోని అన్ని సబ్‌డివిజన్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా విజృంభించిన సమయంలో ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న అభిమానంతోనే తాము చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై దేవేందర్‌, పోలీస్‌ సిబ్బంది, సర్పంచ్‌లు నాగేశ్వర్‌రావు, గోనె మల్లారెడ్డితో పాటు పలువురు రక్తదానం చేశారు. వీరికి సీపీ తరుణ్‌జోషి సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తం 150 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఎంజీఎం బ్లడ్‌బ్యాంకు అందజేశారు. శిబిరాన్ని విజయవంతం చేసిన పోలీసులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎంజీఎం బ్లడ్‌బ్యాంకు ఇన్‌చార్జి డాక్టర్‌ ప్రసాద్‌, డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ నరే్‌షకుమార్‌, సీఐలు వెంకటేశ్వర్లు, ఎస్సైలు దేవేందర్‌, అబ్దుల్‌ రహీం, మోటివేటర్‌ కల్యాణి, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాధవీలత పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T05:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising