ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలను నువ్వే వద్దని చెప్పి.. ఇప్పుడు నిందలు వేస్తావా.. భట్టిపై KC ఫైర్

ABN, First Publish Date - 2021-11-13T21:41:07+05:30

హుజురాబాద్‌లో ఓటమిపై కాంగ్రెస్‌ సమీక్షలో వాడీవేడి చర్చ సాగింది. ఈ భేటీలో టీపీసీసీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: హుజురాబాద్‌లో ఓటమిపై కాంగ్రెస్‌ పార్టీ సమీక్షలో వాడీవేడి చర్చ సాగింది. ఈ భేటీలో టీపీసీసీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఈటల కాంగ్రెస్‌లోకి రాకుండా కొందరు అడ్డుకున్నారని వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈటలను పార్టీలోకి తీసుకోవద్దని నువ్వే చెప్పి ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నావు?’ అంటూ భట్టి విక్రమార్కపై కేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌పైనే కాకుండా సాగర్, హుజూర్‌నగర్, దుబ్బాక ఓటమిపై సమీక్ష నిర్వహించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పార్టీలో కొందరు టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని పొన్నం మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి పార్టీ వీడేందుకు సహకరించి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని పొన్నం కామెంట్ చేసినట్లు సమాచారం. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చూడండని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-13T21:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising