ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌లో చేరడాన్ని విరమించుకున్న నివేదితారెడ్డి

ABN, First Publish Date - 2021-04-01T00:35:12+05:30

కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నివేదితారెడ్డి కలవనున్నారు. సాగర్ బీజేపీ టికెట్ ఆశించి నివేదితారెడ్డి భంగపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నివేదితారెడ్డి కలవనున్నారు. సాగర్ బీజేపీ టికెట్ ఆశించి నివేదితారెడ్డి భంగపడ్డారు. ఆమెను టీఆర్ఎస్‌లో చేర్చుకోవాలని గులాబీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కడారి అంజయ్య టీఆర్ఎస్‌లో చేరడంతో సాధారణ ఎన్నికల్లో తనకే సాగర్ టికెట్ వస్తోందని నివేదితారెడ్డి భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్‌లో చేరే అంశాన్ని ఆమె విరమించుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరతోందన్న ప్రచారానికి నివేదితారెడ్డి తెరదించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకు టికెట్‌ దక్కే అవకాశం లేదని భావించిన నివేదిత అధికారిక ప్రకటన లేకుండా, బీజేపీ కండువా లేకుండానే ముందస్తుగా నామినేషన్‌ వేశారు. అయితే ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. నివేదితారెడ్డి భర్త శ్రీధర్‌రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి నివేదితారెడ్డి పోటీ చేశారు. ఈ ఉప ఎన్నికలలో తనకు టికెట్ రాకపోవడంతో నివేదితారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నివేదితారెడ్డి నిర్ణయం తీసుకున్నారే ప్రచారం జరిగింది.


నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీజేపీ కీలక నాయకుడు కడారి అంజయ్య టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో అంజయ్య టీఆర్‌ఎస్‌‌లో చేరారు. పార్టీలో చేరడానికి ముందు 100 మంది అనుచరులతో అంజయ్య ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి కడారి అంజయ్య టికెట్ ఆశించారు. అయితే ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తన అనుచరులతో కలిసి అంజయ్య టీఆర్‌ఎస్‌‌లో చేరారు.

Updated Date - 2021-04-01T00:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising