ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెలన్నీ బర్రెలు అయ్యాయి: సంజయ్

ABN, First Publish Date - 2021-09-18T23:45:39+05:30

రాష్ట్రంలోని గొర్రెలన్నీ బర్రెలు అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: రాష్ట్రంలోని గొర్రెలన్నీ బర్రెలు అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోని ఎల్లారెడ్డిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు గొర్రెలు ఇస్తామని వారిని మోసం చేసారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో సీఎం కేసీఆర్ పీకింది ఏమీ లేదన్నారు. మోడీ నేతృత్వంలో దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ అందించామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తామని ఆయన ప్రకటించారు.


తెలంగాణ విమోచన దినోత్సవం నాడు కేసీఆర్ జెండా ఎగరవేయలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. ఎంఐఎం భయానికి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. రైతులకు రుణ మాఫీ చేయలేదన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం 120 కోట్లు మంజూరు చేసిందని సంజయ్ తెలిపారు. కేంద్రం వరి కొనదని అంటూ రైతులకు మోసం చేస్తున్నారన్నారు. మంచి చేస్తే తాను చేసానని, చెడు చేస్తే కేంద్రం పైకి నెట్టి వేస్తారని కేసీఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-09-18T23:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising