ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో మరోమాట

ABN, First Publish Date - 2021-11-27T09:17:08+05:30

రాజకీయ అవసరం కోసం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో మరో మాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీ, కాంగ్రె్‌సల వైఖరిని ప్రజలు ఎండగట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ, కాంగ్రె్‌సల వైఖరిని ఎండగట్టాలి: హరీశ్‌రావు 

పటాన్‌చెరు, నవంబరు 26: రాజకీయ అవసరం కోసం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో మరో మాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను  దెబ్బతీస్తున్న బీజేపీ, కాంగ్రె్‌సల వైఖరిని ప్రజలు ఎండగట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ యాదవరెడ్డికి మద్దతుగా శుక్రవారం పటాన్‌చెరులో నిర్వహించిన ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌, బీజేపీలకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతలు విధిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ జిల్లా పరిషత్తులకు రూ.250 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.250 కోట్లు మంజూరు చేసి వాటిని బలోపేతం చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని, ఆ పార్టీకి రైతు సమస్యలు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ధాన్యాన్ని ఎందుకు కొనడంలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-27T09:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising