ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీలపై ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోంది: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2021-12-16T23:41:11+05:30

టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్ల బదిలీలు హేతుబద్దంగా లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.టీచర్ల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.కరోనాతో ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.ప్రభుత్వ జీవో 317పై స్పష్టత లేదన్నారు. కొంత మంది టీచర్ల పిల్లలు జివనైల్ డయాబెటిస్‌తో బాధపడే వారున్నారని చెప్పారు.వారికి రెగ్యులర్‌గా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట ఉండలేని స్థితి ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. 


అలాంటి వారికి ఈ బదిలీలతో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు.విద్యాశాఖ మంత్రి .. చీఫ్ సెక్రటరీ టీచర్ల బదిలీలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.సమగ్రంగా స్టడీ చేయకుండా .. అదరా బాదరాగా బదిలీలపై నిర్ణయం సరికాదన్నారు.టీచర్ల బదిలీలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నానని వివరించారు. టీచర్ల బదిలీలపై ప్రభుత్వం సరైన నిర్ణయంతో బదిలీలు చేయకపోతే పిల్లలపై ప్రభావం పడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-16T23:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising